Sunday, March 2, 2014

ప్రత్యూషం

  
తూరుపు కొండలను దాటి
మెల్లగా కదిలివస్తున్న సూరీడు,
ఎర్రని కాంతులీనుతూ
ఆకాశమంతా తన అందాన్ని
పరుచుకున్నాడు.

వదిలిపోతున్న చీకటి తెరల్ని
దిగులుగా వీడుతున్న నక్షత్రాలు.

రాతిరి పూదోటలో
అకస్మాత్తుగా ముగించిన
కలల పయనం
నిజం కాదని స్పృహ కలిగాక,
ఆ క్షణం..
ఓ తియ్యని చిరునవ్వు
నా పెదాలను ముద్దాడింది.

' ఈ రోజు' అనే కొత్త లోకానికి
స్వాగతం  పలుకుతూ....
ప్రకృతి ఒడిలొ
అధ్బుతమైన చిత్రంలా
అరవిరిసిన ప్రత్యూషం.
నా చిన్ని మనసులో కూడా.


24 comments:

  1. very nice sir...
    నా మనసులో కూడా...

    ReplyDelete
  2. ప్రత్యూషం చాలా బాగుంది

    ReplyDelete
  3. ప్రత్యూషం చాలా బాగుంది

    ReplyDelete
  4. chaalaa baavundanDi .......Radhika (nani)

    ReplyDelete
    Replies
    1. Chaalaa thank you..Radhika (nani) gaaroo:-):-)

      Delete
  5. prabhaatha vela andaalanu maritha andamgaa andinchaaru chaala baagundandi

    ReplyDelete
    Replies
    1. Skv Ramesh..gaaroo,welcome to egise alalu....
      mee spandanaku chaalaa danyavaadamulu!

      Delete
  6. రాతిరి పూదోటలో ముగిసిన పయనం, ఉదయపు నీరెండలో తిరిగి మొలకెత్తుతుంది,
    "ఈరోజు" అనే కొత్తలోకానికి పయనిస్తుంది,
    కార్తిక్ గారూ,ఇలాంటి భావాలు చాలా అరుదుగా దొర్లుతాయి. మీశైలో అద్భుతంగా ఆవిష్కరించ బడ్డాయి.

    ReplyDelete
    Replies
    1. Mee spandana, naa kavitaku oka poodanDalaa anipistundi.
      chaalaa thank you fathima gaaroo:-):-)

      Delete
  7. మీ బ్లాగులోకి అడుగిడితేనే ఓ చల్లని సాయంత్రం సముద్రపు అలలతో గడుపుతున్నంత అందంగా ఉంటుంది,అటువంటిది అక్కడే తెల్లవారేవరకు ఉండిపోతే కనిపించే అరవిరిసిన ప్రత్యూషాన్ని కూడా చూపెడితే ఇక మీ బ్లాగు విడవలేరేమో అని నా అనుమానం....కాదుకాదు నమ్మకమే...

    ReplyDelete
    Replies
    1. మీ అనుమానం..కాదు కాదు..మీ నమ్మకం..అలాగే ఉండాలని...ఆశీస్తూ.. మీ అభినందనకు నా బొలెడన్ని ధన్యవాదములు!!

      Delete
  8. నిజం గా ఓ అందమైన ఉదయాన్ని కళ్ళముందు ఆవిష్కరించారు . చదివాక మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండటం మా తరమా?

    ReplyDelete
  9. ప్రారంభమే శుభారంభం .
    కవిత అసాంతం ఓ అలలా సాగింది
    తేనె తిన్నట్లు... ఎంత తీపో .
    కలాన్ని కదిలించిన తీరు బావుందండీ
    *శ్రీపాద

    ReplyDelete
  10. ఇంత చక్కగా రాయడం మీ ఒక్కరికే సాధ్యం :) నేను ఇంకా ఓనమాల్లోనే ఉన్నాను. చాలా బాగుంది కార్తీక్ గారు.

    ReplyDelete
    Replies
    1. Thanq anonymous gaaru..mee Peru teliste baagunDedi:):)

      Delete