Friday, February 7, 2014

డైరీలో పేజి

 


నక్షత్రపు కాంతుల సౌరభాల్ని
వెదజల్లుతూ పరిమళిస్తున్న రాతిరి,
సాగర తీరపు ఇసుక తిన్నలపై
హత్తుకునే పిల్ల గాలుల ముసుగులో,
తడారని పాదాలతో నేను.

అపుడు-
ఈ సర్వజగత్తును మరిచి
నా అంతరంగములో నేను
ఏకాంతుడినై,
రాలిపడుతున్న అనుభూతుల్ని
మనసు పొరల్లోకి నింపుకున్నాను.

అంతర్లీనంగా
కలల మంచు బిందువులు
కరిగిపోతూ దాహం తీరిస్తే,
వీచె అలల సంగీతాన్ని వింటూ
స్వేఛ్ఛా గీతంలోకి ఒదిగిపొయాను.

కాలం గిర్రున తిరిగింది.
డైరీలో పేజి,
దానిలో అక్షరాలు కూడా మసకబారాయి.
కాని,
నా అనుభవం మాత్రం అలాగే,
         అంతే స్పష్టంగా.
 

34 comments:

  1. కలల మంచు బిందువులు కరిగిపోతూ దాహం తీరిస్తే..
    కార్తిక్ గారూ మంచి భావం ఉంది, కవిత బాగుంది.

    ReplyDelete
  2. కవిత చాలా బాగుంది అండి కార్తీక్ గారు.I can visualise ...
    నక్షత్రపు కాంతుల సౌరభాల్ని
    వెదజల్లుతూ పరిమళిస్తున్న రాతిరి,
    సాగర తీరపు ఇసుక తిన్నలపై
    హత్తుకునే పిల్ల గాలుల ముసుగులో,
    తడారని పాదాలతో నేను.

    ReplyDelete
  3. కవిత చాలా బాగుంది అండి కార్తీక్ గారు. I can visualise...
    నక్షత్రపు కాంతుల సౌరభాల్ని
    వెదజల్లుతూ పరిమళిస్తున్న రాతిరి,
    సాగర తీరపు ఇసుక తిన్నలపై
    హత్తుకునే పిల్ల గాలుల ముసుగులో,
    తడారని పాదాలతో నేను.

    ReplyDelete
    Replies
    1. Welcome to egise alalu, Anuradha gaaru.thanq:-):-)

      Delete
  4. చాలా మంది అక్షర మంచు బిందువులు. కరిగిన కొద్దీ మరిన్నీ అక్షర అలలు.. మీ ఎగిసే అలల్లా.. మంచి భావుకత. సాగర తీరం.. మా వైజాగ్ లో మేం అర్థరాత్రి వరకు అలలతో ఆడుకున్న రోజులను గుర్తు చేశారు కార్తీక్.. సూపర్

    ReplyDelete
  5. ప్రతి అక్షరంలోను భావం ప్రస్ఫుటమైంది...చక్కని చిక్కటి కవిత.

    ReplyDelete
    Replies
    1. Naa Kavita lo chikkadanaanni baagaa gurthincharu.thanq:-):-)

      Delete
  6. కాలం గిర్రున తిరిగింది.కాని,నా అనుభవం మాత్రం అలాగే, అంతే స్పష్టంగా.
    మంచి భావం, బాగుంది చక్కని కవిత.

    ReplyDelete
  7. కాంతులకు సౌరుభాలద్దు కాంక్ష కలదు
    కలలు కరగించి త్రాగు నాకాంక్ష కలదు
    గీతమై స్వేఛ్చగోరు సంగీత ప్రియత
    కలదు కార్తీక ! నీలోన , కవిత లోన .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. Mee spandana chalaa baagundi rajaravu gaaru, thanq:-):-)

      Delete
  8. డైరీలో ఒక్క పేజీనే ఇంత భావగర్భితంగా ఉంటే ఇంకెన్ని మధురమైన భావాలున్నాయో మిగతా పేజీల్లో.

    ReplyDelete
    Replies
    1. Mayavishwam gaaroo, Welcome to egise alalu.
      naa dairy pejilo Unna bhavalanu mee manasutho baagaa chadivinattunnaru:-):-):-)thanq:-):-)

      Delete
  9. మసకబారని అనుభూతులలాగే స్పష్టంగా మీ డైరీలో వుండాలని.. బాగుందండీ కవిత కార్తీక్ గారూ.. అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. Kumaru gaaru, Welcome to egise alalu... mee korika chaalaa baagundi.thanq:-):-)

      Delete
  10. జ్ఞాపకం నక్షత్రమై హృదయాకాశం లో మెరిసినట్లు మీ డైరీ అనుభూతులు బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. జ్ఞాపకం నక్షత్రమై హృదయాకాశం లో మెరిసినట్లు
      mee spandana bagundi. thanq:-):-)

      Delete
  11. karthik Day by day u r becoming very good writer:-)

    ReplyDelete
  12. Replies
    1. N.M.Rao gaaroo,welcome to egise alalu.thanq:-):-)

      Delete
  13. రాలిపడుతున్న అనుభూతుల్ని
    మనసు పొరల్లోకి నింపుకున్నాను.
    మీ అనుభూతులు బాగున్నాయి , అద్భుతం.....

    ReplyDelete
  14. అందమైన స్మ్రుతులు

    ReplyDelete
  15. నిజంగా చాలా బావుంది కార్తీక్ గారు

    ReplyDelete
    Replies
    1. Lokesh Srikanth gaaroo, welcome to egise alalu. Mee spandanaku thanq thanq so much:-):-)

      Delete
  16. చాలా బావుంది కార్తిక్ గారూ :)

    ReplyDelete
  17. కవిత చాలా బాగుందండీ కార్తీక్ గారూ.

    రాలిపడుతున్న అనుభూతుల్ని మనసు పొరల్లోకి నింపుకున్నాను. బాగుంది.

    ReplyDelete