Sunday, March 16, 2014

ఆకాశం పంపిన ప్రేమలేఖ!



ప్రియమైన అవనికి!

"ఎలా ఉన్నావు?" అనే ప్రశ్నను
రాయలేని ప్రేమలేఖిది.
ఎందుకంటే, నీకు తెలుసు
అనూక్షణం..
నువ్వు నా కనుపాపల్లోనే తూగుతావని.
నీ తలపుల నావలోనే
నా జీవన పయనం సాగుతుందని.

అలాగే,
ఇంకా ఎన్ని యుగాలు...
కాలం ఒడిలో కరిగిపోయినా
మన మధ్యనున్న దూరం మాత్రం
మనల్ని విడిచిపోదు.
పాపం, దానికి తెలియదు.
మన మనసుల మధ్య
తనకు చోటులేదని.

కానీ, ఒక్కోసారి
నా మనసులో విరహగీతం
తాకుతుంటే...
నీ ఆలోచనలు నా ఎదపై
వియోగ భారాన్ని వదిలివెళ్తాయి.
అలాంటప్పుడు
ఇదుగో,ఇలా అక్షరాలు లేని కబుర్లు
చినుకై కరిగి నిన్ను ముద్దాడుతాయి.
అయ్యో!అదంతా సిగ్గె!?
భలే అందంగా ఉంది:):)
మళ్ళీ నా ప్రేమలేఖ పంపేవరకూ
కొంచెం దాచుకో మరి!
ఇక సెలవు కోరుతూ...

ఇట్లు,
నీదైన ఆకాశం.

 

10 comments:

  1. అన్వయం అలరించింది

    ReplyDelete
  2. పర్వాలేదు,ఆకాశానికి ఎన్నిభావాలొచ్చ్హో...,చాలాబాగా పలికింది.
    తప్పకుండాఅ దాచుకుంటుంది. కార్తిక గారూ బాష,భావం రెండూ బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. Mee spandanaku chaalaa thanq fathima gaaru:):)

      Delete
  3. బావుందండి. :-) "హరివిల్లు" రాయబారాలు కూడా పంపమనండి. :-)

    ReplyDelete
  4. Welcome to egise alalu..:-):-)
    mee andamaina spandanaku chaalaa thanq lu:):)

    ReplyDelete
  5. ఆకాశం అనురాగం అద్భుతంగా ఉంది కార్తీక్ గారు.

    ReplyDelete
  6. ఎంతటి వారికైనా బుగ్గలు ఎరుపెక్కవూ ఆసాంతం చదివేస్తే.
    భలేగా ఉంది శైలి ... మీరు వాడిన పదజాలం కూడాను.
    క్యా బాత్ హై జి ?

    *శ్రీపాద

    ReplyDelete
  7. Meeru inta isTamgaa naa postlanni chaduvina mee abhinanadanalaku chaalaa thanq sripada gaaru:):)

    ReplyDelete