Tuesday, March 11, 2014

అతడు...ఆమె...ప్రేమ...

అతడు
దేని కోసమో
ఆరాటపడుతూ
వడివడిగా
అడుగులేస్తున్నాడు.
దారి పొడువునా
పచ్చగా మెరిసే
పంటపొలాలు.
గోదారమ్మ ఒడ్డుకి
చేరుకోవడానికి
దాటాల్సిన పొలాలు
ఇంకో అయిదు.

ఆమె
కదులుతున్న
అలలవైపు చూస్తూ..
ఆనందాన్ని
అక్కున చేర్చుకొని
ఎవరి కోసమో
ఆతృతగా
ఎదురుచూస్తుంది.

అతడొచ్చాడు.

ఇరువురి మధ్య
నిశ్శబ్ధం.
ఒకరి శ్వాస
ఒకరికి వినిపించేంతగా.

అతడు
తన పెదాలపై
బిగుసుకున్న
మౌనాన్ని దాటి
"నిన్ను ప్రేమిస్తున్నాను."
అని చెప్పేశాడు.

అంతే

ఆమె చిరునవ్వు
చటుక్కున
అతడి కళ్ళల్లో
మెరిసింది.
ఆ మెరుపులో
వారి మధ్య
మిగిలున్న దూరం
ముక్కలయ్యింది.
కలగన్న అనురాగం
ఒక్కటయ్యింది.
 

10 comments:

  1. నిశ్శబ్ధం పారిపోయింది.

    ReplyDelete
  2. మాట వారదిలా పనిచేసింది,
    బాగుంది చక్కటి కవిత.

    ReplyDelete
    Replies
    1. Fathima gaaru..,mee spandanaku chaalaa thank you:):)

      Delete
  3. ...మిగిలున్న దూరం ముక్కలయ్యింది...
    కలగన్న అనురాగం ఒక్కటయ్యింది...

    with best wishes...

    ReplyDelete
  4. ఆమె చిరునవ్వు అతడి కళ్ళల్లో మెరిసింది.
    చాల బాగుంది మీ కవిత. ఇంతకూ మెరిసినవి మీ కళ్ళేనా karthik ?

    -rAm
    www.naahrudhayam.blogspot.in

    ReplyDelete
    Replies
    1. Ram Kumar gaaru.. welcome to egise alalu.
      naa kallu kaadulendi merisanivi:):)thanq:):)

      Delete
  5. ఇలా అన్ని పదాలు మీరే వాడుకుంటే మేమేం గాను !
    ( సరదాగా ). రూప కల్పన బాగా కుదిరింది. ప్రశాంతంగా
    సాగిందనిపించింది. బావుంది మీ కవిత

    *శ్రీపాద

    ReplyDelete