Wednesday, March 19, 2014

అనుభూతి స్వరాలు




ఎక్కడి నుంచొ వచ్చిన మేఘంలా
నా కనుల ఎదుట  వర్షమై కురిశావు.
ఊహల జలపాతంలా ఉప్పొంగి
నాలో ఆశల తీరాన్ని పలుకరించావు.

నీతో వేసిన ప్రతీ అడుగులో
ఎన్నటికీ చెరగని ఆనవాల్లు.

కన్నులు విప్పిన ప్రతీ కలలో
తడిసిపోతున్న  నీ జ్ఞాపకాలు.

తూరుపు వెలుగంటని వెన్నల్లో
వీచె చల్లని గాలిలా
మదిని తాకిన నీ పరిచయంలో
వింటున్నాను
ఎన్నో అనుభూతులు.
మరుపురాని మధుర గీతాలు.

 

17 comments:

  1. "కన్నులు విప్పిన ప్రతీ కలలో
    తడిసిపోతున్న నీ జ్ఞాపకాలు".
    పై వాఖ్యాలు కవి హృదయాన్ని తెలుపుతాయి,
    ఆతని మదిన మరపురాని మదురగీతాలకు తార్కాణంగా నిరూపిస్తాయి.
    మంచి కవిత, అరమరికలు లేని స్వచ్హమైన మానసిక దోరణి, బాగుంది కార్తిక్ రెడ్డి గారు.

    ReplyDelete
  2. చాలా బాగుంది మీ మధురభావ గీతం.

    ReplyDelete
  3. ఎక్కడి నుంచొ వచ్చిన మేఘంలా
    నా కనుల ఎదుట వర్షమై కురిశావు.
    ఊహల జలపాతంలా ఉప్పొంగి
    నాలో ఆశల తీరాన్ని పలుకరించావు.
    బాగుంది సార్ మీ కవిత ...

    ReplyDelete
  4. wow karthik simply super, with beautiful words.:-)

    ReplyDelete
  5. karthik its simply super, with lovely words, keep it up:-)

    ReplyDelete
  6. కార్తిక్,
    నేను విజయభారతిలో విజయని. భారతి నా సొదరి. మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నాను. ఎన్నీ ఎంతో బాగా రాసారు. ఇవి అర్థం చేసుకునే వాళ్ళకి, ఆనందించే వల్లకే మాత్రమే ఇందులోని అందం భావుకత్వం కనిపిస్తాయి. కాని ఈ కాలంలో అది కొందరికే ఉంది.
    --విజయ

    ReplyDelete
    Replies
    1. Avunandi.kavitalo daagunna andaanni,bhavaanni chusevaallu ee rojullo chaalaa arudugaa unnaaru :):)
      chaalaa thanq:):)

      Delete
  7. చాలా బాగుంది మీ మధురభావ గీతం.

    ReplyDelete
    Replies
    1. Welcome to egise alalu..mani kumari gaaru,,, mee chaalaa
      thank you:):)

      Delete
  8. very very nice... superb karteek garu

    ReplyDelete
  9. "కన్నులు విప్పిన ప్రతీ కలలో
    తడిసిపోతున్న నీ జ్ఞాపకాలు."

    గిలిగింతలు పెట్టాయి పై మాటలు
    ఎంత వద్దనుకున్నా ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు.
    జ్ఞాపకాలను తవ్వించారు కదా మాచేత.
    గుడ్.
    *శ్రీపాద

    ReplyDelete