Monday, April 14, 2014

ఆశల పాట


గదిలో నిశ్శబ్దాన్ని నింపుకోని
దీపపు వెలుతూరులో ఉందామె.
కిటికి ఊచల సందుల్లోంచి
ఎవరికోసమో,దేనికోసమో
గుమ్మం వైపే తదేకంగా చూస్తుంది
.

ఆమె చూపులు
ఎన్నో యుగాల నీరీక్షణను
అంటించుకున్నట్లున్నవి.
ఆమె పెదాలపై
కలల తీగల మెరుపులు
స్పష్టంగా కనపడుతున్నాయి.


అదే దృశ్యం...
అలాగే కొనసాగుతూ ఉంది.

ఆమెలో ఆశ మాత్రం ఎప్పటిలాగే.
కొత్త కొత్త కోరికలను పులుముకుంటూ.


ఎందుకంటే ఆమెకు తెలుసు.
ఇరులలోనే కౌముది అందం
తెలుస్తుందని.
ఎడబాటులోనే జ్ఞాపకాల పాటల్ని
మరింత హాయిగా పాడుకోవచ్చని
.

21 comments:

  1. Aasala paata chaala venula vindugaa vundandi.

    ReplyDelete
    Replies
    1. Himaja gaaru paaTanu mecchukunnaaru chaalaa thannq:):)

      Delete
  2. మరి చంద్రునిలోనే కదా కౌముది తెలుసేది?
    విరహములోనే హాయి ఉన్నది అనుకొన్నట్లుంది.
    చక్కటీ భావుకత కార్తిక్ చాలా బాగుంది.

    ReplyDelete
  3. నైస్ కార్తిక్ .

    ReplyDelete
    Replies
    1. Sharma gaaru, mee abhinandanaku chaaalaa thanq:):)

      Delete
  4. Replies
    1. Bhavya gaaru, mee abhinandalaku chaalaa thanq:):)

      Delete
  5. అలలు ఎగిసాయ్ .. అపలేమిక.

    "ఆమె చూపులు
    ఎన్నో యుగాల నీరీక్షణను
    అంటించుకున్నట్లున్నవి.
    ఆమె పెదాలపై
    కలల తీగల మెరుపులు
    స్పష్టంగా కనపడుతున్నాయి."

    ఎంతటి భావుకత మీ పలుకుల్లో .
    చాలా నచ్చింది నాకు.
    ఉత్కంటను కలిగిస్తూ చివరి వరకూ ఓ చల్లని వాయు పావనం లా నడిచింది మీ కవిత.
    అందుకోండి నా హార్దిక అభినందనలు.

    *శ్రీపాద

    ReplyDelete
  6. I feel very happy..thanq so much Sripada gaaru:):)

    ReplyDelete
  7. భావాలతో అలరించారు

    ReplyDelete
  8. ఎడబాటులోనూ సుఖమున్నదిలే అన్నట్లుగా సాగింది మీ ఈ ఆశలపాట గానం.

    ReplyDelete
  9. Thank you padmarpitha gaaru:):)

    ReplyDelete