Thursday, April 18, 2013

నా మది మౌనరాగం...

ఒక ప్రియుడు తన చెలి స్పందనకై నిరీక్షిస్తూ.. ఉన్నప్పుడు, అలా  మొదలయిన తన మదిలోని మౌనరాగం ..   

నా మనసున పుట్టిన మౌనరాగం 
చెలియా..   నీకు వినబడునా..?
నా  తుది శ్వాస  విడిచేలోగా.  
నాలో కలిగిన అలజడి నీకు తెలిసేనా..? 
నా హృదయ స్పందన అగేలోగా.

నా మదిలో దాచిన  జ్ఞాపకాల బొండు మల్లెలు ..
నీ సిగలో చేరాలని ఆరాటపడుతున్నాయి.
 నా చేతులు నీ రూపం  గీసిస్తునప్పుడు.. 
ఈ వెన్నల జాబిలి చేయి కలయిక ఎప్పుడు ..?
అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
నా కనురెప్పల  వెనుక దాగిన స్వప్నాలు....  
నీ ఒడి  చేరాలని తపిస్తున్నాయి.  

నీపై నా  ప్రేమను ఏంతా?  అని చెప్పమంటే..
దానిని దాచలేని నా ఇరుకు ఎద చెబుతుంది
అది అంతులేని  మహా సాగరమని. 
నీకై  కనురెప్ప వేయకుండా ఎదురుచూసిన క్షణాలకు తెలుసు 
అవి  ఎంత మధురాతిమధురమని. 

ఓ నా ప్రియతమా..... 
నా మది  తలుపు తెరచి నీకై నీరిక్షిస్తూ.. ఉంది 
నీతో గడిపే  మధుర క్షణాల కోసం.  
ఈ నీరిక్షణ ఎన్నాళ్ళు?  అని అంటే..... 
నిన్ను ప్రేమించడానికి సరిపోని ఈ  జీవితం అంటుంది
ఎన్ని జన్మలకైనా  అని. 




24 comments:

  1. కవిత చాలా బాగుంది కార్తీక్ :) కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. నీ నుండి ఇంకా మంచి మంచి కవితల్ని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.

    ReplyDelete
  2. చాలా చాలా థాంక్స్...!

    ReplyDelete
  3. రాసేసారే ప్రేమ పై కవిత్వం!
    రాస్తుండండి. :)

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్.. జలతారువెన్నల గారు..

      Delete
  4. wonderful man.... there you are rocking.......go ...go...

    మంచి ఫీల్ ఉన్నది.....త్వరలో ఎన్నో మంచి మంచి భావాలు అలలై ఎగిసి పదాలని కోరుకుంటున్నాను .....

    ReplyDelete
    Replies
    1. సాగర్...గారు... చాలా థాంక్స్...
      మీ ఎగిసె అలలు మీ కొరిక తప్పక తీరుస్తుంది..

      Delete
  5. వచనం కవితగా మారే దశలో ఉన్నారు . గుడ్! చక్కగా వ్రాయండి అభినందనలు

    అనగ అనగ రాగ మతిశయించు వ్రాస్తూ ఉంటె తప్పు ఒప్పులు మీకే తెలుస్తూ ఉంటాయి .

    ReplyDelete
    Replies
    1. థాంక్స్.. వనజవనమాలి గారు..
      చాలా చక్కని విషయాన్ని తెలిపారు -:)

      Delete
  6. కవిత చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. thanks...Yohanth..గారు.. మీరు ఇలాగే నన్ను అదరిస్తూ ఉండాలని.. నా మనవి!

      Delete
  7. మంచిభావం....ఇలాగే పొంగిపొర్లాలని.

    ReplyDelete
    Replies
    1. thanks..Padmarpita..గారు..నా భావాల అలలు ఇలాగే ఇక ముందు కుడా ఎగుస్తాయి..

      Delete

  8. భావం బాగుంది , కూర్పు విషయంలో యింకొంచెం శ్రధ్ధ తీసుకోండి .

    సాధనమున పనులు సమకూరు ధర లోన అన్నదే లక్ష్యం కావాలి.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ శర్మ గారు.. చాలా మంచి వాక్యం చెప్పారు.. మీకు నా దన్యవాదములు... మీరు ఇలాగె నా తొలి అడుగులను అదరించగలరు....

      Delete
  9. enta baagaa rastunnaaro.....!!
    chaalaa chakkagaa vundi

    ReplyDelete
  10. చాలా థాంక్స్... మంజు గారు..:-)

    ReplyDelete
  11. Hello mithramaa. . .! Okka matalo cheppalante really BEAUTIFUL. . . . . . .

    ReplyDelete
  12. చాలా అందంగా ఎక్ష్ప్రెస్స్ చేసారు కార్తీక్! Keep writing :)

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ ప్రియ గారు..-:)

      Delete
  13. bale rasaru karthik gaaru.

    meeru ila manchi manchi kavithalu rasthoo undandi.. memu chaduvuthoo untamu :)

    ReplyDelete
  14. egise alalu ku swagatham.... jyothi gaaru..
    thnk you..-:)

    ReplyDelete
  15. ప్రియురాలి మనసును దోచే విధంగా ఉంది మీ కవిత..ఇంకా మీ నుంచి మంచి కవితలను ఆశిస్తున్నాము..

    ReplyDelete