Tuesday, April 9, 2013

నా నేస్తమా..!

                రోజూ ఎంతోమందిని కలుస్తాము.... కానీ అందులో ఎవరో ఒక్కరే... మన  మనసుకు మంచి ఆప్తులు అవుతారు....అలాంటి స్నేహం  కలిసినపుడు నాకు, నా మదికి జరిగిన సంభాషణ నుండి వెల్లువైనా  భావాలను  కవితగా  మలిచిందే!  ఈ  "నా నేస్తమా .....!"  

మేఘంకరిగి చినుకుగా  మారి నేలను తాకినట్లు
అనుభవాలు కరిగి మధురక్షణాలై 
నన్ను తడిమే ఈ క్షణం..... 
ఎన్నో  మధురానుభూతులు మదిని స్పృశిస్తూ  
   కనులు అమృత ధారలు కురిపిస్తూ.. 
 నా మదిలోని  ప్రపంచం నాకు  తెలియనివిగా మారాయి నేస్తమా! 
నిన్ను కలిసిన ఈ క్షణం ...... 

ఆనంద జలపాతాలపై ఎగసి 
చిలిపి సంతోషాల  జాడల కోసం..
తలపించనే నా మది పదే పదే. 
ఎందుకు నేస్తం... ?నీ పరిహాసాలు .. . 
మనస్సుతోనే నీ చిలిపితనం
ఆశల సంద్రంలో నా  మదిని విహరింపచేస్తూ... ?
కదిలించే అలల స్వప్నాలు ..
వెల్లువలై సాగే ప్రవాహాల ఆలోచనలు.. 
మదినే కవ్వించే కలవరాలు.. 
మనసుకు అర్థం కానీ చేరువలు... 
ఇలా ఎన్నో మైమరిపించే తలపులు  
 నాలో మెరిసే నిన్ను కలిసిన ఈ క్షణం... 
గాలిలా నీరులా తీరం తెలియని  బాటసారికి 
కలిశావె తీరమల్లె నా  నేస్తమా .....!  

10 comments:

  1. వెరీ గుడ్ !కొన్ని చిన్న చిన్న తప్పులు మినహా చాలా చక్కని భావ ప్రకటన .
    వ్రాస్తూనే ఉండండి .భావితరాలకి తెలుగు కవితా ప్రతినిధిగా వ్రాస్తూనే ఉండండి . అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ఇవి నా జీవితంలో మొదటి రచనలు..మొదటిది కూడా 'నా నేస్తమా..!' కవితే..కనుక ఈ ఒక్కసారి నా మిస్టేక్స్ ను మీ కవితాదయ హృదయంతో క్షమించగలరు...మీరిలాగే నా తొలి అడుగులు సరిదిద్దగలరని..మనవి!

      Delete
  2. good start ...good luck.
    (remove word verification during comment)

    ReplyDelete
    Replies
    1. మిస్టేక్స్ ఉంటె ఏమనుకోకండే ప్లీజ్...మీ లాంటి వారు సలహాలు ఇవ్వగాలరని మనవి!

      Delete
  3. మీ కవితా ప్రస్థానం బాగుంది. మీ నేస్తాలు ఎంతదృష్టవంతులో... congrats..

    ReplyDelete
    Replies
    1. థాంక్స్...కెక్యూబ్ వర్మ గారు... మీలాంటి వారు నా తొలి కవిత బావుంది అన్నందుకు నేనే చాలా అదృష్ట వంతున్ని....ఫ్రెండ్..

      Delete
  4. మేఘంకరిగి చినుకుగా మారి నేలను తాకినట్లు....
    అనుభవాలు కరిగి మధురక్షణాలై ...
    అంటూ మొదలెట్టిన మీ మొదటి కవిత లో మొదటి రెండు లైన్లూ చాలా అద్భుతంగా ఉన్నాయి.
    మరిన్ని మంచి భావాలకు కవితా రూపం ఇవ్వాలని, ఇస్తారనీ ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా ధన్యవాదాలండీ..మీ ప్రశంసకు... నా తొలి అడుగులకు..మీలాంటి వారి చేయూత చాలా ప్రీతికరం ..-:)

      Delete
  5. అద్భుతంగా ఉంది

    ReplyDelete
  6. chalaa thanks... mahidi gaaru...-:)

    ReplyDelete