ఒక ప్రియుడు తన చెలి స్పందనకై నిరీక్షిస్తూ.. ఉన్నప్పుడు, అలా మొదలయిన తన మదిలోని మౌనరాగం ..
నా మనసున పుట్టిన మౌనరాగం
చెలియా.. నీకు వినబడునా..?
నా తుది శ్వాస విడిచేలోగా.
నాలో కలిగిన అలజడి నీకు తెలిసేనా..?
నా హృదయ స్పందన అగేలోగా.
నా మదిలో దాచిన జ్ఞాపకాల బొండు మల్లెలు ..
నీ సిగలో చేరాలని ఆరాటపడుతున్నాయి.
నా చేతులు నీ రూపం గీసిస్తునప్పుడు..
ఈ వెన్నల జాబిలి చేయి కలయిక ఎప్పుడు ..?
అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
నా కనురెప్పల వెనుక దాగిన స్వప్నాలు....
నీ ఒడి చేరాలని తపిస్తున్నాయి.
నీపై నా ప్రేమను ఏంతా? అని చెప్పమంటే..
దానిని దాచలేని నా ఇరుకు ఎద చెబుతుంది
అది అంతులేని మహా సాగరమని.
నీకై కనురెప్ప వేయకుండా ఎదురుచూసిన క్షణాలకు తెలుసు
అవి ఎంత మధురాతిమధురమని.
ఓ నా ప్రియతమా.....
నా మది తలుపు తెరచి నీకై నీరిక్షిస్తూ.. ఉంది
నీతో గడిపే మధుర క్షణాల కోసం.
ఈ నీరిక్షణ ఎన్నాళ్ళు? అని అంటే.....
నిన్ను ప్రేమించడానికి సరిపోని ఈ జీవితం అంటుంది
ఎన్ని జన్మలకైనా అని.
కవిత చాలా బాగుంది కార్తీక్ :) కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. నీ నుండి ఇంకా మంచి మంచి కవితల్ని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.
ReplyDeleteచాలా చాలా థాంక్స్...!
ReplyDeleteరాసేసారే ప్రేమ పై కవిత్వం!
ReplyDeleteరాస్తుండండి. :)
చాలా థాంక్స్.. జలతారువెన్నల గారు..
Deletewonderful man.... there you are rocking.......go ...go...
ReplyDeleteమంచి ఫీల్ ఉన్నది.....త్వరలో ఎన్నో మంచి మంచి భావాలు అలలై ఎగిసి పదాలని కోరుకుంటున్నాను .....
సాగర్...గారు... చాలా థాంక్స్...
Deleteమీ ఎగిసె అలలు మీ కొరిక తప్పక తీరుస్తుంది..
వచనం కవితగా మారే దశలో ఉన్నారు . గుడ్! చక్కగా వ్రాయండి అభినందనలు
ReplyDeleteఅనగ అనగ రాగ మతిశయించు వ్రాస్తూ ఉంటె తప్పు ఒప్పులు మీకే తెలుస్తూ ఉంటాయి .
థాంక్స్.. వనజవనమాలి గారు..
Deleteచాలా చక్కని విషయాన్ని తెలిపారు -:)
కవిత చాలా బాగుంది
ReplyDeletethanks...Yohanth..గారు.. మీరు ఇలాగే నన్ను అదరిస్తూ ఉండాలని.. నా మనవి!
Deleteమంచిభావం....ఇలాగే పొంగిపొర్లాలని.
ReplyDeletethanks..Padmarpita..గారు..నా భావాల అలలు ఇలాగే ఇక ముందు కుడా ఎగుస్తాయి..
Delete
ReplyDeleteభావం బాగుంది , కూర్పు విషయంలో యింకొంచెం శ్రధ్ధ తీసుకోండి .
సాధనమున పనులు సమకూరు ధర లోన అన్నదే లక్ష్యం కావాలి.
థాంక్స్ శర్మ గారు.. చాలా మంచి వాక్యం చెప్పారు.. మీకు నా దన్యవాదములు... మీరు ఇలాగె నా తొలి అడుగులను అదరించగలరు....
Deleteenta baagaa rastunnaaro.....!!
ReplyDeletechaalaa chakkagaa vundi
చాలా థాంక్స్... మంజు గారు..:-)
ReplyDeleteHello mithramaa. . .! Okka matalo cheppalante really BEAUTIFUL. . . . . . .
ReplyDeletethanks.. karthik.. -:)
ReplyDeleteచాలా అందంగా ఎక్ష్ప్రెస్స్ చేసారు కార్తీక్! Keep writing :)
ReplyDeleteచాలా థాంక్స్ ప్రియ గారు..-:)
Deletebale rasaru karthik gaaru.
ReplyDeletemeeru ila manchi manchi kavithalu rasthoo undandi.. memu chaduvuthoo untamu :)
egise alalu ku swagatham.... jyothi gaaru..
ReplyDeletethnk you..-:)
ప్రియురాలి మనసును దోచే విధంగా ఉంది మీ కవిత..ఇంకా మీ నుంచి మంచి కవితలను ఆశిస్తున్నాము..
ReplyDeletethanks navajeevan gaaru..
Delete