Saturday, August 9, 2014

హృదయము రాసుకున్న లేఖ


నీతో గడిపిన క్షణాలన్నింటి మీద కాలం,
చక్రాలేసుకుని పరుగులు తీస్తుంటుంది.
నీతో కలిసి పయనించిన ఆ దారుల్లో
ఏవో అనుభూతి గీతాలు వినిపిస్తున్నాయి.


నీ నవ్వులు విరబూసిన వెన్నల రాతిరితో
నాలో గణించలేని నక్షత్రాలను వెలిగిస్తుంటావు.
నీ మనసు కంటున్న కలల పుస్తకంలో
నేను కలాన్నై రాయాలని ఆశ పెడుతుంటావు.


నీ అడుగులు కోరే గమనం నేనై
నా గమ్యం తలచే తీరం నీవై
ప్రణయపు మంత్రలోకాల్లో ఊగిసలాడే 

ఆ క్షణాలకోసం ఎదురుచూస్తూ...


నా హృదయము రాసుకున్న ఈ లేఖ
నీ హృదయానికి చేరేదెన్నడో?
మన గుండెల చప్పుళ్ళు ఒకటయ్యేదెప్పుడో?



4 comments:

  1. కవిత లో మంచి శైలి ఉంది.

    ReplyDelete
  2. Akka,meeku naa kavitaloa shaii nachinanduku chaalaa happygaa undi. Thank u so much akka:):)

    ReplyDelete
  3. నీ అడుగులు కోరే గమనం నేనై
    నా గమ్యం తలచే తీరం నీవై...nice

    ReplyDelete