Saturday, July 19, 2014

మనసులోని అక్షరం


మనసులో మెరిసిన మెరుపొక ఆలోచన.
ఆ మెరుపు వెనుక పరుగులుతీసే మనసు
ఏదో రాయాలని.
అంతే కదా!
మనసు ఆలోచనను పుట్టించిది.
ఆలోచన తిరిగి మనసును నడిపిస్తుంది
.

అక్షరాల వెదుకులాటలో
అలసట లేని ప్రయాణం మొదలైంది...
అనుభవాల కుండలో అనుభూతుల్ని మోసుకెళ్తూ.


సేకరించిన అనుభూతులన్నింటిని
దోసిలితో పైకెత్తి  గుండెలకు హత్తుకున్నాను.
అంతే! ఆ క్షణంలో...
అన్నీ అనుభూతులు సిరాలా రూపుదాల్చి
కాగితంపై అక్షరాలుగా జాలువారాయి.


రాసిన దానిని తిరిగి చూశాను.
అపుడు-
కనిపిస్తున్నది అందంగా ముస్తాబయిన అక్షరాలు కావు.
భావుకతపు రంగుల్ని అద్దుకున్న నా మనసు.

10 comments:

  1. చాలా బాగుంది . మానసిక సంఘర్షణ

    ReplyDelete
  2. భావాలు, అనుభవాలూ అక్షరాలుగా మారి కవితల అల్లికలో ఎలా ఇమిడిపోతాయో చక్కగా చెప్పారు

    ReplyDelete
  3. ఈ కవిత చదువుతుంటే ఆత్రేయ గారు గుర్తుకొచ్చారు .
    ఆయన మనసుతో ఆడుకున్నట్లుగా ( నాకు తెలిసినంతవరకు )
    ఎవరూ ఆడుకోలేదు , వాడుకోనూ లేదు .

    బాగుంది .

    ReplyDelete
    Replies
    1. mee spandanaku chaalaa chalaa thanq sharma gaaru:-):-)

      Delete
  4. కవులు, రచయితల అంతరంగపు ఛాయలను కవితా ముఖంగా సిరాక్షరాల ద్వారా...సారీ.. బ్లాగాక్షరాల ద్వారా కవిత్వంగా చెప్పినందుకు ధన్యవాదాలు.. చాలా బాగుంది..

    ReplyDelete
  5. Replies
    1. Manaavi gaaru..welcome to egise alalu...:):)
      thanq:):)

      Delete