Thursday, January 15, 2015

కొన్ని అంతే!(ఒక అందమైన కవిత)




నింగి చెక్కిలి నుండి జారిపడే
చిట్టి చినుకు 
పుడమిపై ఏ సోయగాన్ని ముద్దాడుతుందో?
"ఊహించే అంచనాలకు అందనిదది.

అర్ణవపు చూపుల్లో ఆశగా ఎగిసిపడే
కలల అలలు
ఆకాశం వైపు ఎందాక ఎగురుతాయో?
"గణిత సూత్రాలకు తలొగ్గవవి."

అడవి గుండెల్లో ప్రేమగా ఒదిగిపోయే
వసంతపు ఆకుపచ్చగీతం
అంత మాధుర్యంగా ఎలా వుంటుందో?
"ఏ స్వరకర్తకూ అర్థంకాదది."

కొన్ని అంతే!
ఎవ్వరికీ ఎప్పటికీ
అందవు.తలొగ్గవు.అర్థంకావు.

ఇలాంటివి కొన్నుంటాయి.
మన అక్షరాలలో దాచుకోవాల్సినవి.
వదిలిపెట్టకూడనివి.


4 comments:

  1. బ్యూటిఫుల్. నిజంగా ఇలాంటివి కొన్నుంటాయి అక్షరాలలో దాచుకోవాల్సినవి .

    ReplyDelete
  2. ఈ తవికల పిచ్చి ఒక పట్టాన వదిలేది కాదులే బయ్యా. తవికెలు బాబోయ్ తవికలు.

    ReplyDelete