మనసులో మెరిసిన మెరుపొక ఆలోచన.
ఆ మెరుపు వెనుక పరుగులుతీసే మనసు
ఏదో రాయాలని.
అంతే కదా!
మనసు ఆలోచనను పుట్టించిది.
ఆలోచన తిరిగి మనసును నడిపిస్తుంది.
అక్షరాల వెదుకులాటలో
అలసట లేని ప్రయాణం మొదలైంది...
అనుభవాల కుండలో అనుభూతుల్ని మోసుకెళ్తూ.
సేకరించిన అనుభూతులన్నింటిని
దోసిలితో పైకెత్తి గుండెలకు హత్తుకున్నాను.
అంతే! ఆ క్షణంలో...
అన్నీ అనుభూతులు సిరాలా రూపుదాల్చి
కాగితంపై అక్షరాలుగా జాలువారాయి.
రాసిన దానిని తిరిగి చూశాను.
అపుడు-
కనిపిస్తున్నది అందంగా ముస్తాబయిన అక్షరాలు కావు.
భావుకతపు రంగుల్ని అద్దుకున్న నా మనసు.