ఈ విచిత్రమైన తోటలో
ఎన్ని అందమైన పువ్వులున్నాయో!?
లెక్కపెడదామనుకున్నాను. కానీ
నా అలోచనలకు అందడంలేవవి.
అహ!,ఎలా దోబుచులాడుతున్నాయో!?
కొన్ని క్షణాల్లో మాయమవుతూ,
మరికొన్ని కొత్తవి విరబూస్తూ,
ఇంకా కొన్ని రాలిపడుతూ,
భలే తమాషాగా ఉన్నాయి.
ఇంతకీ ఇది ఏ తోట?
నింగిలో కురిసే వెన్నల వర్షమా!?
మనసును తడిపే ఆశల గీతమా!?