అసలెందుకో...? ఈ కలవరం.
చిగురించే ఆశలకు వేదికగా
వింత అలజడులకు ఆహ్వానం.
పలుకరిస్తున్న ప్రతీ తలపు,
నీ సాహచర్యంలో గడిపిన క్షణాలను
మోసుకొస్తుంటే....
వాటిని అస్వాధిస్తున్న నా మనసు,
కొత్త తీరానికి గమ్యం వెదుకుతూ..
గుర్తించింది ఆ తీరం నువ్వేనని,
వెదకుతున్న నా గమ్యం నీ ప్రేమే అని.
వింత అలజడులకు ఆహ్వానం.
పలుకరిస్తున్న ప్రతీ తలపు,
నీ సాహచర్యంలో గడిపిన క్షణాలను
మోసుకొస్తుంటే....
వాటిని అస్వాధిస్తున్న నా మనసు,
కొత్త తీరానికి గమ్యం వెదుకుతూ..
గుర్తించింది ఆ తీరం నువ్వేనని,
వెదకుతున్న నా గమ్యం నీ ప్రేమే అని.
కాదేమో అని నా మదిని వారిస్తుంటే..
నేనే సాక్ష్యం అంటూ..
నన్ను ఒక్కడినే ఒంటరిగా వదిలించుకుని,
రెప్పపాటులో రెక్కలు విప్పుకుని
ఎగిరిపోతోంది.........
ఆకాశమంత ఎత్తున దాచుకున్న నీ ప్రేమకై.
నేనే సాక్ష్యం అంటూ..
నన్ను ఒక్కడినే ఒంటరిగా వదిలించుకుని,
రెప్పపాటులో రెక్కలు విప్పుకుని
ఎగిరిపోతోంది.........
ఆకాశమంత ఎత్తున దాచుకున్న నీ ప్రేమకై.