ఒక ప్రియుడు తన చెలి స్పందనకై నిరీక్షిస్తూ.. ఉన్నప్పుడు, అలా మొదలయిన తన మదిలోని మౌనరాగం ..
నా మనసున పుట్టిన మౌనరాగం
చెలియా.. నీకు వినబడునా..?
నా తుది శ్వాస విడిచేలోగా.
నాలో కలిగిన అలజడి నీకు తెలిసేనా..?
నా హృదయ స్పందన అగేలోగా.
నా మదిలో దాచిన జ్ఞాపకాల బొండు మల్లెలు ..
నీ సిగలో చేరాలని ఆరాటపడుతున్నాయి.
నా చేతులు నీ రూపం గీసిస్తునప్పుడు..
ఈ వెన్నల జాబిలి చేయి కలయిక ఎప్పుడు ..?
అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
నా కనురెప్పల వెనుక దాగిన స్వప్నాలు....
నీ ఒడి చేరాలని తపిస్తున్నాయి.
నీపై నా ప్రేమను ఏంతా? అని చెప్పమంటే..
దానిని దాచలేని నా ఇరుకు ఎద చెబుతుంది
అది అంతులేని మహా సాగరమని.
నీకై కనురెప్ప వేయకుండా ఎదురుచూసిన క్షణాలకు తెలుసు
అవి ఎంత మధురాతిమధురమని.
ఓ నా ప్రియతమా.....
నా మది తలుపు తెరచి నీకై నీరిక్షిస్తూ.. ఉంది
నీతో గడిపే మధుర క్షణాల కోసం.
ఈ నీరిక్షణ ఎన్నాళ్ళు? అని అంటే.....
నిన్ను ప్రేమించడానికి సరిపోని ఈ జీవితం అంటుంది
ఎన్ని జన్మలకైనా అని.